జిల్లా కన్వీనర్‌గా కేసరి ఆంజనేయులు గౌడ్
రెబ్బెన: ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్‌గా రెబ్బెన మండలం గోలేటికి చెందిన కేసరి ఆంజనేయులుగౌడ్ నియామకమయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ జిల్లా కమిటీని శుక్రవారం ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా ఆంజనేయులు గౌడ్, కోకన్వీనర్లుగా బండి రాజేందర్, చేపూరి నవీన్‌గౌడ్, షిండే సోమేశ్వర్‌లను నియమించారు. ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ ప్ర ధాని మోదీ పిలుపుతో స్వదేశీ సంకల్పం ద్వా రా స్వావలంబన వైపు దేశం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ప్రజా ఉద్యమం మొదలైందన్నారు. సెప్టెంబర్ 25న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజు ఉద్యమం ప్రా రంభం కాగా, డిసెంబర్ 25న వాజ్‌పేయ్ జ యంతి వరకు కొనసాగుతుందని తెలిపారు.


