కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
దహెగాం(సిర్పూర్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరిధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలో సొసైటీ, ఐనం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు మాట్లాడుతూ కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, మిల్లర్లు కోత విధిస్తున్నారని తెలిపారు. యాసంగి ధాన్యానికి బోనస్ అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్‌డీవో దత్తారావు, డీసీఎస్‌వో వసంత లక్ష్మి, డీఏవో వెంకటి, ఏడీఏ మనోహర్, సహకార సంఘం చైర్మన్ తిరుపతిగౌడ్, వైస్ చైర్మన్ ధనుంజయ్, ఏవో రామకృష్ణ, సీఈవో బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
బొప్పురం రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
దహెగాం మండలం బొప్పురం గ్రామానికి మంజూరైన బీటీరోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భూమి పూజ చేశారు. ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్టీ ఎస్‌డీఎఫ్ కింద రోడ్డు నిర్మాణంతోపాటు, ఒర్రైపె వంతెన కోసం రూ.3.13 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.


