‘బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్లొద్దు’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొద్దని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్‌నార్ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద జేఏసీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుత రాస్తారోకో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ ప్రణయ్, నాయకులు కోట వెంకన్న, వైరాగడె మారుతి, లహుకుమార్, శ్రీనివాస్, ఆనంద్, శ్రీకాంత్, సాయికృష్ణ, యాదగిరి, నాందేవ్, హనుమంతు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


