బాలల హక్కులపై అవగాహన
ఆసిఫాబాద్‌రూరల్: అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా గురువారం మండలంలోని అంకుసాపూర్ పాఠశాలలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీసీపీవో మహేశ్ బాలల హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ మాట్లాడు తూ బాలలు జీవించే, రక్షణ పొందే, అభివృద్ధి చెందే హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ హక్కులకు భంగం కలి గితే 1098 చైల్డ్ హెల్ప్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి హక్కులపై ప్ర తిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ సిబ్బంది ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, జము న, రవళి, వెంకటేశ్వర్లు, రాణి పాల్గొన్నారు.


