జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన మహేశ్ జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ యాదగిరి తెలి పారు. పాఠశాల ఆవరణలో గురువారం పీడీ కోట యాదగిరి, వైస్ ప్రిన్సిపాల్ రహీం, సంతోష్‌తో కలిసి విద్యార్థిని అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అండర్– 17 హ్యాండ్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికయ్యాడని అన్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు కర్ణాటకలో జరిగే పోటీల్లో రాష్ట్ర జట్టు తరుఫున మహేశ్ పాల్గొంటాడని తెలిపారు.


