పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సమస్యలను విడతల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్ ఏరియాలో రోడ్డుపై నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గురువారం మార్కెట్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా డ్రెయినేజీ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్, వ్యాపారులు పాల్గొన్నారు.


