ఈపీ ఆపరేటర్లకు పదోన్నతి పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖైరిగూర ఓసీపీలో బుధవారం బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఈపీ ఆపరేటర్లకు పదోన్నతి కోసం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల నుంచి ఈపీ ఆపరేటర్లు హాజరయ్యారు. డీ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ కోసం నిర్వహించిన పరీక్షకు 9 మంది, సీ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్ పదోన్నతి కోసం 38 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్వోటూజీఎం రాజమల్లు, కార్పొరేట్ మెంబర్ శ్రీరాంపూర్ డీజీఎం పర్సనల్ అనిల్‌కుమార్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, పర్సనల్ హెచ్‌వోడీ మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


