‘కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ విఫలం’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రూప్‌నార్ రమేశ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపకుండా అన్యాయం చేస్తోందని, పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయడం సిగ్గుచేటన్నారు. గురువారం అంబేడ్కర్ చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహించే శాంతియుత రాస్తారోకోను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కోకన్వీనర్ ఆవిడపు ప్రణయ్, నాయకులు సాయికృష్ణ, సంజీవ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.


