సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు
కాగజ్‌నగర్‌టౌన్: రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటి అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని దుర్గానగర్ రైతువేదికలో బుధవారం డ్రాప్ట్ సీడ్‌బాల్‌పై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ డ్రాప్ట్ సీడ్ బాల్‌పై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనలు, సంస్కరణల గురించి వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి సుప్రజ, ఏవో రామకృష్ణ, కేవీకే బెల్లంపల్లి శాస్త్రవేత్తలు, ఏఈఓలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


