కనుల పండువగా దీపోత్సవం
జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం కార్తిక దీపోత్సవం కనుల పండువగా సాగింది. లక్సెట్టిపేటకు చెందిన ప్రణవ్‌శర్మ ఆధ్వర్యంలో 18 మంది వేద పండితులు ప్రత్యేక శివలింగార్చన, గణపతి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సోనేరావు దంపతులతోపాటు కుమారుడు సాయినాథ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు క్షేమంగా ఉండాలని, ప్రతిఒక్కరూ సుఖ శాంతులతో గడపాలని కార్తిక దీపోత్సవం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా మహిళలు పెద్దఎత్తున హాజరై దీపాలు వెలిగించారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నాయకులు మర్సుకోల సరస్వతి, బుర్స పోచయ్య, గంధం శ్రీనివాస్, సాంగ్డె జీవన్ పాల్గొన్నారు. – ఆసిఫాబాద్‌అర్బన్
కనుల పండువగా దీపోత్సవం


