మహిళలకు ‘ఇందిరమ్మ’ చీరలు
బెజ్జూర్(సిర్పూర్): మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ సి ద్ధం చేసింది. బుధవారం హైదరాబాద్‌లో సీఎం రే వంత్‌రెడ్డి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించగా, గురువారం నుంచి జిల్లాలో చీరల పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాకు 35,758 చీ రలు చేరగా, మిగిలినవి త్వరలో సరఫరా అవుతా యని అధికారులు వెల్లడించారు. రాంపూర్ గోదాంలో 24,720, జైనూర్ గోదాంలో 3,937, కౌటాల గో దాంలో 7,101 చీరలను నిల్వ ఉంచారు. వీటిని ప్ర ధాన నిల్వ కేంద్రాలుగా గుర్తించారు. గోదాములకు వచ్చే ప్రతీ రవాణా వాహనాన్ని అధికారులు స్వయ ంగా తనిఖీ చేసి డిజిటల్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. పారదర్శకత, చీరల క్వాలిటీ పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశా రు. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో చీరలు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
పంపిణీకి ఏర్పాట్లు
ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో చీరల పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. మొదట స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు అందించాలని భావించినా.. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారందరికీ అందించనున్నారు. మొదటి విడతగా గురువారం నుంచి డిసెంబర్ 9 వరకు 335 గ్రామ పంచాయతీల్లో పంపిణీ చేయనున్నారు. అనంతరం రెండో విడతగా మార్చి 1 నుంచి 8 వరకు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ప్రక్రియ పూర్తి చేస్తారు. సిర్పూర్ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా ఆర్డీవో లోకేశ్వర్‌రావు వ్యవహరించనున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా సంఘాలు, పంచాయతీ సిబ్బంది పంపిణీ ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. చీర తీసుకున్న మహిళల పేరు, ఆధార్ వివరాలను పకడ్బందీగా నమోదు చేయనున్నారు. ఈ విషయంపై జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ యాదగిరిని సంప్రదించగా, ఉన్నతాధికారుల మేరకు చీరల పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.


