అట్టహాసంగా జోనల్‌స్థాయి పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆద ర్శ క్రీడాపాఠశాలలో బుధవారం ఆశ్రమ పాఠశాల ల జోనల్‌స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యా యి. ఆసిఫాబాద్, మంచిర్యాల, జైనూర్, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి బాలబాలికలు పోటీలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై డీటీడీవో రమాదేవితో కలిసి పోటీలను ప్రారంభించారు. డీఎస్‌వో షేకు మాట్లాడుతూ జోనల్‌స్థాయి క్రీడాపోటీలకు 800 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. మొదటిరోజు అథ్లెటిక్స్‌లో 8 అంశాలు, ఖోఖో, కబడ్డీ, రన్నింగ్, చెస్, క్యారమ్ పోటీలు నిర్వహించామని తెలిపారు. రెండోరోజు పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవోలు లక్ష్మయ్య, శివకృష్ణ, శ్రీనివాస్, సురేశ్, జీవరత్నం, మాజీ జెడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, కోచ్‌లు అరవింద్, తిరుమల్, విద్యాసాగర్, పీఈటీలు పాల్గొన్నారు.
అట్టహాసంగా జోనల్‌స్థాయి పోటీలు


