ఆకట్టుకున్న యువజనోత్సవం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు కనువిందు చేశాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. కళా కారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. జానపద నృత్య విభాగంలో గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులు మొదటిస్థానంలో నిలిచారు. ఉపన్యాసంలో గిరిజన బాలికల పాఠశాలకు చెందిన మొనరాణి ప్రథమ స్థానం, అరుణ్ ద్వితీయ స్థానం సాధించారు. జానపద పాటల్లో గిరిజన బాలికల పాఠశాల విద్యార్థిని వైష్ణవి మొదటిస్థానం, శివాత్మిక ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో అశ్వక్ అహ్మద్, న్యాయ నిర్ణేతలు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న యువజనోత్సవం


