పోగొట్టుకున్న 41 మొబైళ్లు అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో మంగళవారం 41 మంది బాధితులకు పోగొట్టుకున్న మొబైళ్లను ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రూ.44.76 లక్షల వి లువైన 373 మొబైళ్లు రికవరీ చేశామని తెలి పారు. బాధితులు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డీ సీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఐటీకోర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సీసీ కిరణ్ పాల్గొన్నారు.
పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలి
పొగమంచుతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పే ర్కొన్నారు. వాహనాలు, పాదాచారులు, పశువులు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.


