తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే
ఆసిఫాబాద్: తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ బాధ్యత పిల్లలదేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళాశిశు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండ ర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పా టు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు కలెక్టర్ వెంకటే శ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి డీకే రాణి, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రా వుతో కలిసి హాజరయ్యారు. వయోవృద్ధులు– తల్లి దండ్రుల పోషణ, సంక్షేమ చట్టం– 2007పై అవగా హన కల్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మా ట్లాడుతూ యువత మత్తుకు బానిలసై క్షణికావేశంలో నేరాలు చేస్తున్నారని, ఆస్తుల కోసం కన్నవారికి, తోడబుట్టిన వారికి హాని చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తల్లిదండ్రులను పోషించని కుమారులు, కుమార్తెలపై 28 కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఆసిఫాబాద్ డివిజన్‌లో ఆర్డీవో, కాగజ్‌నగర్ డివిజన్‌లో సబ్ కలెక్టర్ స్థాయి ట్రిబ్యునల్స్ పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆస్తులు తీసుకుని పోషణ, సంరక్షణ పట్టించుకోకుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. నిరాదరణకు గురైన వారు టోల్‌ఫ్రీ నం.14567ను సంప్రదించాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల నివారణపై సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం– 2007 పోస్టర్ ఆవిష్కరించారు. వందేమాతరం గీతాలాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్, జిల్లా అధికారులు, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


