
ఆదివాసీ భవన్ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
కెరమెరి: మండల కేంద్రంలోని నెహ్రూనగర్ సమీపంలో ఉన్న కుమురంభీం ఆదివాసీ భవన్‌ను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండల కేంద్రంలో ఉన్న ఏకై క ఆదివాసీ భవన్‌లో పక్కా ప్రణాళికతో టైల్స్ పగులగొట్టి విద్యుత్ వైర్లను, బోర్డు, బోరు స్టార్టర్‌ను దొంగిలించినట్లు తెలిపారు. దుండగులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, ఆదివాసీ సీనియర్ నాయకుడు సిడాం జగన్నాథ్‌రావు, రాజ్‌గోండ్ సేవాసమితి మండలాధ్యక్షుడు పెందోర్ రాజేశ్వర్, నాయకులు సోము, సిడాం ధర్మూ, కుమురం భీంరావు, తదితరులు పాల్గొన్నారు.