
ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
బెజ్జూర్(సిర్పూర్): 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్, సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల అధికారి శ్రద్ధా శుక్లా అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం బీఎల్‌వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి నూతన ఓటర్లను నమోదు చేయాలని, చనిపోయినవారి జాబితా రూపొందించాలని ఆదేశించారు. తప్పొప్పులు సవరించాలని అన్నారు. గ్రామాల నుంచి వలస వెళ్లినవారిని గుర్తించడంతోపాటు నకిలీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, డిప్యూటీ తహసీల్దార్ భీమ్లానాయక్, సీనియర్ అసిస్టెంట్ అచ్యుత్‌రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బీఎల్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల తనిఖీ
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని గన్నారం ట్రైబల్ వెల్ఫేర్ అప్‌గ్రేడేడ్ రెసిడెన్షియల్ కళాశాలను గురువారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తని ఖీ చేశారు. రెసిడెన్షియల్‌లోని వంటశాలను పరిశీ లించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. కోడిగుడ్లు, పాలు ఇస్తున్నారా.. అని ఆరా తీశారు. డైనింగ్ హాల్‌లో విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. మోనూ ప్రకా రం భోజనం అందించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకు లు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించి నిబంధనలు పాటించాలని సూచించారు.