
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
వాంకిడి(ఆసిఫాబాద్): రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే డీలర్లను హెచ్చరించారు. మండల కేంద్రంలోని రాయల్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్, నిల్వలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ దుకాణంలో ధరలు, నిల్వల స్టాక్ పట్టికలు ప్రదర్శించాలన్నారు. యూరియా, డీఏపీ, ఇతర మందులు అధిక ధరలకు విక్రయించడం, ఇతర మార్గాల ద్వారా తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ స్టాకు వివరాలు సమర్పించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ అధికారి గోపికాంత్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.