
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్(రెవెన్యూ), కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సోమవారం తనిఖీలు నిర్వహించారు. యూరియా అక్రమ అమ్మకాలపై ‘సాక్షి’లో సోమవారం ‘యూరియా దందా’ అనే కథనం ప్రచురితం కావడంతో దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వలు పరిశీలించారు. రైతు ఆగ్రోస్ కేంద్రంలోని యూరియా విక్రయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విక్రయానికి సంబంధించిన రశీదులు ఉండాలని సూచించారు. అనంతరం గోదాముల్లో ఎరువుల నిల్వ పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మనోహర్, తహసీల్దార్ పుష్పలత, ఏవో మనీషా, సిబ్బంది పాల్గొన్నారు.
ఎఫెక్ట్

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు