
ఓపెన్ పది, ఇంటర్ ప్రవేశాలు పెంచాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలు పెంచాలని వయోజన విద్య రాష్ట్ర సంచాలకుడు శివకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీవో కార్యాలయంలో శనివారం అదనపు డీఆర్‌డీవో రామకృష్ణతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని దిగువ శాఖలతోపాటు గ్రామాల్లో చదువు మధ్యలో ఆపిన వారికి అవగాహన కల్పించి ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. పదో తరగతి పూర్తి చేసిన వీఏవోలు ఓపెన్ ఇంటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ విధానంలో పదో తరగతికి రూ.500, ఇంటర్‌కు రూ.1000 రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 11లోగా ప్రవేశాలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, అశోక్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఓపెన్ స్కూల్ రిసోర్స్‌పర్సన్లు రాజేశ్, ప్రకాష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.