
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ఆసిఫాబాద్‌రూరల్: యువత చెడు అలవాట్లకు దూ రంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సమాజంలో తప్పుడు మార్గాలు అనుసరించేవారి సంఖ్య పెరిగిందన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి, హెరాయిన్, మద్యం, సిగరేట్లు, గుట్కాకు బానిసలుగా మారొద్దన్నారు. న్యాయ సహాయం కోసం వెంటనే 15100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యాదగిరి, లీగల్ అండ్ డిఫెన్స్ కన్వీనర్ అంజనిదేవి, అధ్యాపకులు సంతోష్, మహేశ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.