
అనాథ చిన్నారులకు అండగా ఉంటాం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో కోవిడ్– 19 సమయంలో అనాథలుగా మారిన చిన్నారులకు అండగా ఉంటామని జిల్లా సంక్షేమశాఖ అధికారి భాస్కర్, డీసీపీవో మహేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలల రక్షణ భవనంలో శుక్రవారం అనాథ పిల్లల పోషకులతో సమావేశం నిర్వహించారు. వారు మా ట్లాడుతూ కోవిడ్ కారణంగా అనాథలైన ఏడుగురు చిన్నారుల చదువు, సంక్షేమం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. స్పాన్సర్‌షిప్ పథకం కింద నెలకు రూ.4వేల నగదుతోపాటు పుస్తకాలు, యూనిఫాం, షూలు అందజేస్తామని తెలిపారు. పీఎంకే పథకం కింద నమోదైన వీరికి 23 ఏళ్ల నిండిన తర్వాత రూ.10లక్షల ఆర్థికసాయం అందుతుందన్నారు. బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో వారి సంరక్షణ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ విభాగం సిబ్బంది శ్రావణ్‌కుమార్, చంద్రశేఖర్, నవీన్ తదితరలు పాల్గొన్నారు.