
ప్రతిరోజూ సాధన..
రెబ్బెన: సింగరేణి యాజమాన్యం 2015లో యోగా శిక్షణపై అవగాహన కల్పించడంతోపాటు ఉచితంగా శిక్షణ సైతం ప్రారంభించడంతో నేను శిక్షణ తీసుకున్నారు. నాలుగేళ్లపాటు గురువు రాజలింగు, రాజ్యలక్ష్మి వద్ద సాధన చేశా. 2019 నుంచి సింగరేణి ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో సంస్థ ఉద్యోగులు, అధికారులకు యోగాసనాలు నేర్పిస్తున్నాను. 2015 నుంచి ఇప్పటివరకు ప్రతిరోజూ గంటకు పైగా సాధన చేస్తా. నిరంతర యోగా సాధనతో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఏకాగ్రత, రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. కరోనా సమయంలో మా బంధువులను చాలా మందికి పాజిటివ్ వస్తే ఆస్పత్రులకు తీసుకెళ్లాను. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటంతో మహమ్మారి నుంచి తప్పించుకున్నా.
– కనుకుంట్ల సుధ, శిక్షకురాలు