
ఆరోగ్య రక్షణకు యోగా శిబిరాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు యోగా శిబిరాలు నిర్వహిస్తున్నామని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. ఏరియాలో అన్ని గనుల డిపార్టుమెంట్లలో శుక్రవారం యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఉద్యోగులు, అధికారులతో కలిసి జీఎం యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులు యోగా సాధన చేస్తూ ఆరోగ్యమైన జీవన విధానానికి బాటలు వేసుకోవాలని సూచించారు.
నేడు మెగా యోగా క్యాంప్
గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మెగా యోగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు జీఎం విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎస్వోటూజీఎం రాజమల్లు, అధికారులతో కలిసి యోగా క్యాంపు నిర్వహించే మైదానాన్ని పరిశీలించారు. ఏర్పాట్లతోపాటు మొక్కలు నాటే ప్రదేశాన్ని పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమాల్లో అధికారుల సంఘం నాయకులు ఉజ్వల్‌కుమార్ బెహరా, ఏరియా ఇంజినీర్ రామనాథం, సివిల్ డీజీఎం ఎస్‌కే మదీనా బాషా, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, పర్చేస్ అధికారి రవికుమార్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.