అడ్మిషన్ల వేట! | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్ల వేట!

Jun 19 2025 4:16 AM | Updated on Jun 19 2025 4:16 AM

అడ్మి

అడ్మిషన్ల వేట!

● ప్రవేశాల కోసం అధ్యాపకుల విస్తృత ప్రచారం ● జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు

ఈ ఏడాది ప్రవేశాల తీరు..

కళాశాల అడ్మిషన్లు

ఆసిఫాబాద్‌ 107

రెబ్బెన 105

కాగజ్‌నగర్‌ 90

వాంకిడి 71

జైనూర్‌ 62

సిర్పూరు(టి) 39

తిర్యాణి 34

కెరమెరి 29

బెజ్జూర్‌ 21

కౌటాల 15

దహెగాం 3

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా అధ్యాపకులు విస్తృత ప్ర చార కార్యక్రమాలు చేపడుతున్నారు. కాలేజీల్లో అ త్యుత్తమ బోధన, వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 11 ప్ర భుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. జనరల్‌లో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, ఒకేషనల్‌లో ఎంఎల్‌టీ తదితర గ్రూపులు అందుబాటులో ఉన్నా యి. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియలో కోర్సులు బోధిస్తుండగా, కాగజ్‌నగర్‌ పట్టణంలో ఉర్దూ మీడియం కూడా బోధిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో జనరల్‌ విభాగంలో 2,816, వొకేషన్‌ విభాగంలో 630 మొత్తం 3,446 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 30తో మొదటి విడత అడ్మిషన్ల గడువు ముగి యనుండగా ఆశించిన మేర ప్రవేశాలు కాలేదు.

నెమ్మదిగా ప్రవేశాలు

జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జూనియర్‌ కళాశాలల్లో 576 అడ్మిషన్లు వచ్చాయి. ఇందులో జనరల్‌ విభాగంలో 470, ఒకేషనల్‌ విభాగంలో 106 మందికి ప్రవేశాలు కల్పించారు. జిల్లాకేంద్రంలోని జూనియర్‌ కాలేజీతో పాటు రెబ్బెన, కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాలేజీల్లో మాత్రమే మోస్తరు ప్రవేశాలు నమోదయ్యాయి. ఇక సిర్పూర్‌(టి), తిర్యాణి, కెరమెరి, బెజ్జూర్‌, కౌటాల, దహెగాంలో కనీసం 50 అడ్మిషన్లు దాటకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన బోధనతోపాటు ప్రోత్సాహకాలు, అన్ని వసతులు కల్పిస్తున్నా కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేట్‌ కాలేజీల్లో చేర్పిస్తున్నారు.

సకల సదుపాయాలు..

జిల్లాలో ఇంటర్‌ కాలేజీలు కొన్నేళ్లుగా మెరుగైన ఉ త్తీర్ణత సాధిస్తున్నాయి. ప్రవేశాల కోసం కళాశాల ప్రారంభానికి దాదాపు 50 రోజుల ముందు నుంచే అధ్యాపకులు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. కళాశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థుల త ల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్లు పెంచేలా చ ర్యలు తీసుకుంటున్నారు. ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకార వేతన సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. జిల్లాలో బస్సు సౌకర్యం లేని రూ ట్లను గుర్తించి ఆర్టీసీ ద్వారా బస్సులు కూడా నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ క ళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్లో ఫీజుల మాఫీతోపాటు గ్రంథాలయా లు, క్రీడలు, ఎన్‌సీసీ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

మెరుగైన విద్యాబోధన

జిల్లాలోని 11 ప్రభు త్వ జూనియర్‌ కళా శాలల్లో నిపుణులైన అధ్యాపకులతో మె రుగైన బోధన అంది స్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం. ఎలాంటి ఫీజులు ఉండవు.. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా వారు ఎంచుకున్న లక్ష్యాలు చేరుకునేలా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలోని కాలేజీలకు సొంత భవనాలు, విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వ కళాశాలల్లోనే చదివించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.

– సీహెచ్‌ కళ్యాణి, డీఐఈవో

అడ్మిషన్ల వేట!1
1/1

అడ్మిషన్ల వేట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement