
శిఖం భూములు స్వాహా..!
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ మండలం దరోగపల్లి వద్ద ఉచ్చమల్ల వాగుపై రైతులకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం ఉచ్చమల్ల వాగు ప్రా జెక్టు నిర్మించింది. అయితే కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టు శిఖం భూములను కొందరు వ్యక్తులు య థేచ్ఛగా చదును చేస్తూ పంటలు సాగు చేస్తున్నారు. ఏటా అక్రమార్కులు సాగు విస్తీర్ణం పెంచుతుండటంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
129 ఎకరాలు సేకరణ
ప్రభుత్వం ఉచ్చమల్లవాగుపై ప్రాజెక్టు నిర్మించడానికి 2007లో రైతుల నుంచి 129 ఎకరాలు సేకరించింది. 2012లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పెంచికల్‌పేట్ మండలంలోని దరోగపల్లి, కొత్తగూ డ, చేడ్వాయి గ్రామాలకు చెందిన రైతులు తూము ద్వారా పంట పొలాలకు నీటిని మళ్లించుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తూములు కొందరు ధ్వంసం చేయడంతో పంట పొలాలకు సాగు నీరందడం లేదు.
శిఖం భూముల్లో సాగు..
ప్రాజెక్టు శిఖం భూముల్లో కొంతమంది వ్యక్తులు అ క్రమంగా ప్రవేశించి పంటలు సాగు చేస్తున్నారు. అధికారుల నిఘా కొరవడడంతో ఇదే అదునుగా పెద్ద మొత్తంలో భూములు ఆక్రమిస్తున్నారు. ప్రా జెక్టు తూములు ధ్వంసం చేయడంతో ప్రాజెక్టు నుంచి నీరు నిరంతరం వృథాగా పోతోంది. ఈ కారణంగా శిఖం భూముల్లో సాగు సులువైంది. ఇదే విషయంపై గతంలో చేడ్వాయి గ్రామానికి చెందిన మ త్స్యకారులు శిఖం భూముల్లో ఆక్రమణలు అడ్డుకున్నారు. ప్రాజెక్టును రక్షించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికై నా ప్రాజెక్టును కాపాడాలని వారు కోరుతున్నారు.
ఉచ్చమల్ల వాగు ప్రాజెక్టులో ఆక్రమణలు
శిఖం భూమిలో వ్యవసాయ పనులు
ఆందోళనలో ఆయకట్టు రైతులు

శిఖం భూములు స్వాహా..!