పెరిగిన రుణ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన రుణ లక్ష్యం

May 16 2025 1:44 AM | Updated on May 16 2025 1:44 AM

పెరిగిన రుణ లక్ష్యం

పెరిగిన రుణ లక్ష్యం

● 6,295 మహిళా సంఘాలకు రూ.232.44 కోట్లు అందించాలని టార్గెట్‌ ● గతేడాది లక్ష్యానికి మించి అందజేత ● ఖరారుకాని సీ్త్రనిధి రుణ లక్ష్యం

తిర్యాణి: మహిళల స్వయం ఉపాధి కల్పనకు రుణాలు అందించేందుకుగానూ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. ఆయా సంఘాలలోని సభ్యుల అవసరాల మేరకు తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేస్తోంది. దీంతో పాటు సీ్త్ర నిధి ద్వారా సైతం స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు అందజేస్తున్నారు. ఇట్టి రుణాలను సభ్యులు సులభమైన నెలవారి వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కాగా రుణాల మంజూరుకు ప్రతీ ఆర్థిక సంవత్సరంలో అధికారులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందుకు తగినట్లు మహిళా సంఘాలకు రుణాలు అందజేస్తారు. అయితే 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికలను అధికారులు ఇటీవల ఖరారు చేశారు..

6,295 సంఘాలు.. రూ.232.44 కోట్ల రుణాలు

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 6,295 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.232.44 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.221 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యానికి మించి రూ.229 కోట్ల రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా అందించి 103 శాతం లక్ష్యాన్ని సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణ లక్ష్యం కొంతమేర పెంచారు. దీంతో ఈ ఏడాది మరిన్ని సంఘాలకు రుణాలు అందే అవకాశం ఉంది. కాగా సీ్త్రనిధికి సంబంధించి మహిళా సంఘాల సభ్యులకు అందించే రుణ లక్ష్యాలను అధికారులు ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాది అత్యధికంగా కాగజ్‌నగర్‌లో రూ.27.77, వాంకిడిలో రూ.22.63, రెబ్బెనలో రూ.22.60 కోట్ల రుణాలు అందించనుండగా అత్యల్పంగా లింగాపూర్‌లో రూ.5.58, పెంచికల్‌పేట్‌లో రూ.7.02, సిర్పూర్‌(యూ)లో రూ.7.07 కోట్లు అందజేయనున్నారు..

ప్రణాళికలు సిద్ధం చేశాం

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 6,295 మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.232.44 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించాం. గతేడాది లక్ష్యానికి మించి అందించిన రుణాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది లక్ష్యాన్ని ఛేదిస్తాం. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశాం.

– దత్తారాం, డీఆర్‌డీవో, ఆసిఫాబాద్‌

మండలాల వారీగా రుణ లక్ష్యం వివరాలు

మండలం సంఘాలు లక్ష్యం (రూ.కోట్లలో)

ఆసిఫాబాద్‌ 539 20.70

బెజ్జూర్‌ 352 13.74

దహెగాం 436 16.33

జైనూర్‌ 364 13.03

కాగజ్‌నగర్‌ 752 27.71

రెబ్బెన 633 22.60

సిర్పూర్‌(యు) 195 7.07

సిర్పూర్‌(టి) 414 14.77

వాంకిడి 614 22.63

తిర్యాణి 393 14.13

పెంచికల్‌పేట్‌ 193 7.02

లింగాపూర్‌ 142 5.58

కౌటాల 486 17.77

కెరమెరి 425 15.77

చింతలమానెపల్లి 357 13.53

మొత్తం 6,295 232.44

పెట్రోల్‌ బంకులు, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కసరత్తు

మహిళా సంఘాలకు కేవలం రుణాలు అందించే వరకే పరిమితం కాకుండా వారు స్వయం ఉపాధి పొందేలా అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అడుగులు వేస్తోంది. జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ పట్టణాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఏడాది నూతనంగా పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అంతేకాకుండా రెబ్బెన మండలంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సైతం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి లభించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా జిల్లా కేంద్రంలోని థియేటర్‌ను కొన్నేళ్లుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement