
‘రెవెన్యూ’లో వసూళ్ల పర్వం: ఎమ్మెల్యే హరీశ్‌బాబు
రెవెన్యూ కార్యాలయానికి సర్టిఫికెట్ల కోసం వెళ్లే వారి నుంచి అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్‌బాబు ఆరోపించారు. దిందా, కొండపల్లి గ్రామాల పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రిజర్వ్ ఫారెస్ట్ భూములున్న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. పెంచికల్‌పేట్ పెద్ద వాగు అప్రోచ్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసినా రెవెన్యూ అధికారుల తీరుతో ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదని తెలిపారు. జిల్లాకు ఆనుకుని ప్రాణహిత ప్రవహిస్తున్నా చుక్కా సాగునీరు పొలాలకు అందడం లేదని తెలిపారు. కౌటాల మండల కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రభుత్వం భూమి కేటాయించాలని కోరారు.