
వంతెనలు త్వరగా పూర్తి చేయాలి
కెరమెరి: మండలంలోని లక్మపూర్, అనార్‌పల్లి వాగులపై అసంపూర్తిగా ఉన్న వంతెనలను త్వరగా పూర్తి చేయాలని మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ గురువా రం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వాగుల అవతల ఉన్న సుమారు 15 గ్రామాల ప్రజలు వానాకాలంలో అనేక క ష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఏటా వర్షా కాలంలో ఆయా గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉంటున్నారన్నారు. స్పందించిన కలెక్టర్ సంబంఽధిత గుత్తేదారుతో మాట్లాడి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్, శశాంక్ పాల్గొన్నారు.