
ప్రశాంతంగా పాలిసెట్
బెల్లంపల్లి/ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్ర సాంకేతిక విద్య కళాశాలల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగి సింది. 8,195 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7,719 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజ రు శాతం 94.19గా నమోదైంది. 476 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మంచిర్యాల, కుమురంభీం ఆ సిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కోఆర్డినేటర్, బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట ర్ ఎం.దేవేందర్‌రెడ్డి తెలిపారు. మంచిర్యాలలో అ త్యధికంగా 161 మంది, బెల్లంపల్లిలో అత్యల్పంగా 55 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
జిల్లాల వారీగా ఇలా..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2,558 మందికి 2,397 మంది పరీక్ష రాయగా 161 మంది గైర్హాజరయ్యారు. బెల్లంపల్లిలో 1,081 మందికి 1,026 మంది పరీక్ష రాయగా 55 మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. కుమురంభీం జిల్లాలో 1,032 మంది దరఖాస్తు చేసుకోగా 965 మంది పరీక్ష రాశారు. 76 మంది గైర్హాజరయ్యారు. నిర్మల్ జిల్లాలో 2,422 మందికి గాను 2,305 మంది హాజరు కాగా 117 మంది హాజరు కాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 1,102 మందికి గాను 1,026 మంది పరీక్ష రాయగా 67 మంది గైర్హాజరయ్యారు. గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులం, బాలికల గురుకులం, మాతృశ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పాలిసెట్ జిల్లా కన్వీనర్ కనకయ్య తనిఖీ చేశారు.
ఉమ్మడి జిల్లాలో 94.19శాతం హాజరు

ప్రశాంతంగా పాలిసెట్