
బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అర్హులకు పదోన్నతులు కల్పించడమే బదిలీలు చేపట్టాలని పీఆర్‌టీయై టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్‌రెడ్డి కోరారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు అధ్యక్షతన జరి గిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇవ్వగా.. ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డుల జారీకి విధివిధానాలు సిద్ధమవుతున్నాయని తెలిపా రు. కాగా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వై.వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ చేయగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కట్టా శేఖర్‌రావును ఆ స్థానంలో నియమించారు. ఈ సందర్భంగా ఆయనతో దామోదర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శేఖర్‌రావును పలువురు అభినందించారు. ఈకార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మోత్కూరి మధు, కె.వెంకటనర్సయ్య, శ్రీనివాసరెడ్డి, జితేందర్‌రెడ్డి, నరేష్, యలమద్ది వెంకటేశ్వర్లు, మల్లెంపాటి శ్రీధర్, కె.శ్రీధర్‌రావు, శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
దామోదర్‌రెడ్డి