టేకులపల్లి: రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడమే కాకుండా గౌరవ వేతనం చెల్లించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఊకె శేఖర్‌రావు కోరారు. ఈసందర్భంగా సోమవారం ఇల్లెందుకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు న్యాయం చేయాలని కోరారు. సంఘం బాధ్యులు ఎల్.దేవ్‌సింగ్, ఏ.రామా, బాలు, ఆంగోతు సంతులాల్, ఎల్.చందర్, బి.వెంకన్న, జి.హేమచంద్ర, జి.కల్యాణ్, బి.బాలు, ధరావత్ మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి, కలెక్టర్‌ను కలిసిన ప్రేమ్‌లాల్
టేకులపల్లి మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ టీజీటీ హిందీ టీచర్‌గా పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించారని ఇటీవల వెల్లడించిన దివ్యాంగుడు వాంకుడోత్ ప్రేమ్‌లాల్ సోమవారం ఇల్లెందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందచేశారు. దీంతో పక్కనే ఉన్న ఐటీడీఏ పీఓను పిలిచి సమస్య పరిష్కరించాలని మంత్రి సూచించారు.