
ద్విభాషా విధానంపై సందిగ్ధం
బనశంకరి: కర్ణాటకలో విద్యా వ్యవస్థలో అనేక ఏళ్లుగా ద్వి భాషా విధానం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. హిందీ భాష కు అడ్డుకట్ట వేయాలంటే కన్నడ, ఇంగ్లీష్ భాషలు మాత్రమే చాలునని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాల్లో ద్విభాషా విధానం అమలులో ఉంది. కన్నడనాట కూడా అమలు చేయాలని భాషావేత్తలు, కన్నడ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం సిద్దరామయ్య స్పందన పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై ప్రామాణికంగా పనిచేస్తున్నానని, కులమత తారతమ్యంలేని సమాజమే కువెంపు ఆశయమని ఆయన అన్నారు. కానీ నేడు విద్యా విధానంలో వైజ్ఞానికత లోపిస్తోందని చెప్పారు. ఆదివారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో కువెంపు విచారక్రాంతి అనే పుస్తకాన్ని సిద్దరామయ్య విడుదలచేసి మాట్లాడారు. రాజకీయంగా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. ద్విభాషా విధానంలో తన అభిప్రాయమే ప్రభుత్వ అభిప్రాయమన్నారు. కానీ సిద్దరామయ్య గట్టి నిర్ణయం తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. ద్విభాషా విధానంలో విద్యాబోధన చేయాలని సోషల్ మీడియాలో కన్నడిగులు డిమాండ్ చేశారు.
అమలు చేయాలని డిమాండ్లు