
మైసూరు: మైసూరు జిల్లాలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం కేసులు పెరిగిపోవడంతో పోలీసులు వాటికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. నంజనగూడులో పోలీసులు డ్రగ్స్ వ్యతిరేక జాతాను నిర్వహించారు. ఎస్పీ సీమా లాట్కర్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శ్రీకంఠేశ్వర స్వామి దేవాలయం నుంచి జాతా ఆరంభమై పట్టణ క్రీడా మైదానం వరకు చేరుకుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసైతే జీవితం నాశనమవుతుందని నినాదాలు చేశారు. యువత, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
జాతాలో పాల్గొన్న పోలీసులు, విద్యార్థులు