రాష్ట్రస్థాయికి ‘అల్ఫోర్స్’ నమూనాల ఎంపిక
కొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు రూపొందించిన నమూనాలు ఎంపికై నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలి పారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో గత మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025–26 , ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనాక్ 2024–25 ప్రదర్శనలో విద్యార్థులు పి.నిశాంత్, ఆండ్రియా మదన్‌జోష్, బి.స్నితిక్, ఎస్.నితీశ్‌కుమార్, అవి జ్ఞ నమూనాలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. వీరిని డీఈవో శ్రీరామ్ మొండయ్య, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి, డీసీఈ బీ కార్యదర్శి భగవంతరావు అభినందించారు.


