● బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే సొంత డబ్బులతో గ్రామంలో ప్రధానంగా అవసరమున్న ఆరు హామీలను నెరవేరుస్తానని బీజేపీ బలపర్చిన అభ్యర్థి దాసరి గణేశ్ బుధవారం గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గెలిపించిన నెల రోజుల్లోపే గ్రామస్తుల సమక్షంలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. గ్రామస్తులు తనపై నమ్మకం ఉంచి గెలిపించాలని కోరారు. గణేశ్ గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో బరిలో ఉండే అభ్యర్థులు ఖంగుతిన్నారు.
హామీలు నెరవేర్చకపోతే నెలలోపే రాజీనామా


