ఊరుతండా..
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని జైసేవాలాల్ ఊరుతండా (నిమ్మపల్లి) గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. ఊరుతండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఇస్లావత్ మంజులతోపాటు మరో ముగ్గురు గుగులోత్ ప్రమీల, ఇస్లావత్ ప్రమీల, ఇస్లావత్ కవిత నామినేషన్ వేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వడంతో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్థి మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ వార్డులో ఇస్లావత్ మంజుల, 2వ వార్డులో మాలోత్ నరన్, 3వ వార్డులో అజ్మీర జబ్బర్, 4వ వార్డులో అజ్మీర సోనవ్వ, 5వ వార్డులో ఇస్లావత్ రవీందర్, 6వ వార్డులో అజ్మీర లావణ్య ఏకగ్రీవమయ్యారు. దీంతో కోనరావుపేట మండలంలో రెండు పంచాయతీలు కమ్మరిపేటతండా, ఊరుతండా ఏకగ్రీవమయ్యాయి.


