సర్పంచ్ బరిలో తండ్రీకొడుకులు
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ పంచాయతీ సర్పంచ్ స్థానం కోసం తండ్రీకొడుకులు పోటీపడుతున్నారు. కొండ నారాయణ, కొండ శ్రావణ్‌కుమార్ తండ్రీకొడుకులు. రెండోవిడతలో తొలిరోజు నారాయణ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా.. కుమారుడు శ్రావణ్ చివరిరోజు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానం జనరల్ కేటగిరీలో ఉంది. ఒకే ఇంట్లోంచి తండ్రీకొడుకులిద్దరూ సర్పంచ్ పదవి కోసం పోటీ పడడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటారా? లేక ఇద్దరూ బరిలోనే ఉంటారా? అనేదానిపై చర్చలు జోరందుకున్నాయి.
గుబులు పుట్టిస్తున్న గుర్తులు
● ఓటర్లకు అంతుపట్టని గుర్తులు .. అభ్యర్థులకు చిక్కులు
కమాన్‌పూర్(మంథని): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులకు అక్షరమాల ప్రకారం కేటాయించిన గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. గుర్తులు ఒకేపోలికతో ఉండడంతో నిరక్షరాసులు, వృద్దులు గుర్తుంచుకోవడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పంచాయతీలో ఏడుగురు పోటీలో ఉండగా అధికార, ప్రతిపక్షపార్టీల మద్దతో పటీపడుతున్న వారికి అనుకులమైన గుర్తురాలేదు. దీంతో వారు నిరుత్సహం చెందుతున్నారు. మిగతావి దాదాపు ఒకేమాదిరిగా ఉండడంతో తమకు వచ్చేఓట్లు ఎటువైపు పడతాయోనని అభ్యర్థులు అయోమయానికి గురువుతున్నారు. ఒకగ్రామంలో ఇద్దరు లేదా ముగ్గురు పోటీలో ఉంటే.. బ్యాలెట్ పత్రాల్లో అనుకూలంగా ఉండే గుర్తులు వచ్చేవని చర్చించుకుంటున్నారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఓటర్లు గుర్తు పెట్టుకునేలా ఎలా అవగాహన కల్పించేదని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులే కాకుండా నామినేషన్లు వేసి పోటీలో ఉన్నవారికి అనుకూలమైన గుర్తులు రావడంతో వారు సంతోషపడుతున్నారు.
సిలిండర్ల దొంగ అరెస్ట్
● 38 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
● జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడి
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న గ్యాస్ సిలిండర్ల దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని అరెస్ట్ చూపారు. పట్టణానికి చెందిన సమీర్ అనే వ్యక్తి కొద్దినెలలుగా రాత్రి వేళల్లో ఇళ్లలో చొరబడి సిలిండర్లు ఎత్తుకెళ్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా వేశారు. జిల్లాకేంద్రంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకుని విచారణ చేపట్టగా నిజం ఒప్పుకొన్నాడు. అతని నుంచి 38 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే ఏడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సైలు సుప్రియ, రవికిరణ్, ఏఎస్సై వేణురావు, కానిస్టేబుళ్లు విజయ్, జీవన్ పాల్గొన్నారు.
సర్పంచ్ బరిలో తండ్రీకొడుకులు
సర్పంచ్ బరిలో తండ్రీకొడుకులు


