రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కరీంనగర్‌క్రైం: బైకుపై వెళ్తుండగా కుక్కఅడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తికి గాయపడగా చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం సంతోష్‌నగర్‌కు చెందిన బోయినపల్లికి చెందిన వెంకటరమణరావు (56) లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారానికి వెళ్లి వస్తుండగా గత నెల 30వ తేదీన అర్ధరాత్రి ఇంటికి వచ్చే క్రమంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కిందపడడంతో గాయలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించా రు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


