
దేహదానానికి ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం
సిరిసిల్లకల్చరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్ కుటుంబం దేహదానానికి అంగీకరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తమ దేహాలను ఇచ్చేందుకు అంగీకరిస్తూ అర్జీ పెట్టుకున్నారు. అభ్యర్థనను అంగీకరిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ బుధవారం సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ రఘునందన్‌తోపాటు అతని సతీమణి, తండ్రిని సైతం దేహదానానికి ఒప్పించారు. జిల్లాలో దేహదానానికి ముందుకొచ్చిన మొదటి వ్యక్తి ప్రిన్సిపాల్ విజయ రఘునందన్. అతనితోపాటు తన కుటుంబంలోని మరో ఇద్దరిని ఒప్పించడం అభినందించాల్సిన విషయం.
మెడికల్ కాలేజీకి ఇచ్చేందుకు అంగీకారం