
ఆధా(ర్)రం లేక.. అక్షరానికి దూరం
‘సారూ.. మేము గుడిసెలో పుట్టాం. మా తల్లిదండ్రులకు సదువు రాదు. మేమన్నా సదువుకుందామంటే ఆధార్‌కార్డు లేదని సర్కారు బడిలోకి రానిస్తలేరు. ఏదన్నా పని చేసుకుందానుకుంటే బాలకార్మికులంటుర్రు. గిదెక్కడి అన్యాయం. సారూ మాకు ఆధా(ర్)రం చూపండి’ అంటూ.. కనిపించిన వారినల్లా ఈ చిన్నారులు ప్రాధేయపడుతున్నారు. జిల్లాకేంద్రంలోని ఆరెపల్లి శివారులోని శ్రీరాజరాజేశ్వరకాలనీకి చెందిన చిన్నారులు ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు లేక చదువుకు దూరం అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వీరికి స్థిర నివాసం లేకపోవడమే అని చెబుతున్నారు. కలెక్టర్‌ను కలిసినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్