
కళాసిల్క్ చేనేత హస్తకళకు ఆదరణ
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా అంబేద్కర్‌భవన్ సాయినగర్–8వ క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కళాసిల్క్ చేనేత హస్తకళ ప్రదర్శనకు విశేష ఆదరణ లభిస్తోంది. మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైనర్, పోచంపల్లి చీరలు, డ్రస్ మెటీరియల్స్, చుడీదార్స్, షూటింగ్స్ షర్టింగ్స్, జ్యువెల్లరీ, బెడ్‌షీట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వహకుడు వినోద్ జైన్ తెలిపారు. ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడల్లో ప్రఖ్యాతి పొందిన చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. హర్యానా బెడ్‌కవర్లు, కుషన్ కవర్లు, లక్నో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, డోర్ కర్టన్స్, స్టోన్ జ్యువెల్లరీ, పెరల్స్, క్రాఫ్ట్‌స్, బంజారా, కోల్‌కతా బ్యాగులు, ఒడిశా పెయింటింగ్స్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరీ, రాజస్థాన్ కోటా బాందేజన్, బ్లాక్‌ప్రింట్స్, సంగ్నరి ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఉత్తరప్రదేశ్ జామ్దాని, బనారస్ లక్నోవి డ్రెస్ మెటీరియల్స్ పాటు పలు రకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.