
ఆత్మీయ సమావేశం
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్ వెలిశాల కొండాల్‌రావు శుక్రవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి విద్యార్థులు హాజరై ప్రిన్సిపల్‌తో కలిసి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ వైస్‌చాన్స్‌లర్ వీరారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ భూమయ్య, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌తో పాటు, మాజీమంత్రులు రాజేశంగౌడ్, ఎల్.రమణ, సుద్దాల దేవయ్య ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ఎంతో గొప్పదని, మాజీ ప్రధానమంత్రి పీవీ.నర్సింహరావు సహకారంతో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనర్సింహరావు చొరవతో ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయని తెలిపారు.