
‘పార్లమెంట్ అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి’
కరీంనగర్‌టౌన్: జిల్లాలోని కొత్తపల్లి– హుస్నాబాద్ మధ్య రూ.77.2కోట్ల అంచనాతో చేపట్టిన ఫోర్‌లేన్ విస్తరణ శంకుస్థాపనకు, హుస్నాబాద్‌లో 250పడకల ప్రభుత్వ ఆసుపత్రి, 50పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభాని కి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చండీఘడ్ వెళ్లాల్సి రావడంతో హాజరుకాలేకపోయానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తన ను ఆహ్వానించిన పొన్నం ప్రభాకర్‌కు, అభివృద్ధి పనుల ప్రారంభానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహకు ధన్యవాదా లు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సైతం పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
అంధుల పాఠశాలకు అండగా ఉంటాం
కరీంనగర్ కల్చరల్: శాతవాహన విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ అంధుల పాఠశాలకు అండగా ఉంటామని యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ పేర్కొన్నారు. ది వ్యాంగురాలు హెలెన్ కెల్లర్ పుట్టిన రోజు సందర్భంగా లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సౌజన్యంతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధుల మెదడు చురు గ్గా పని చేస్తుందన్నారు. ఏకాగ్రతతో చదివితే ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందన్నారు. పాఠశాలను దత్తత తీసుకుని తమ అధ్యాపకులతో వారానికి ఒకటి, రెండు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. వీసీ, సిబ్బంది శ్రీకాంత్, సంతోష్, మారుతీ కలిసి రూ.12,000 విరాళం అందించారు. లీడ్ ఇండియా అధ్యక్షుడు బుర్ర మధుసూదన్‌రెడ్డి, ఎం.మహేందర్‌రెడ్డి, సురేందర్, ఉపాధ్యాయులు రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సరళ పాల్గొన్నారు.
శుక్రవారం సభతో మహిళల సమస్యలు పరిష్కారం
కరీంనగర్‌రూరల్: మహిళా సమస్యలకు శుక్రవారం సభ పరిష్కారవేదికగా నిలుస్తోందని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పేర్కొన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలను శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని సూ చించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో షుగర్ బోర్డు ఏర్పాటు చేశామని, షుగర్‌తో వచ్చే అనారోగ్య సమస్యల గురించి స్పష్టంగా తెలుస్తుందన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళలో భాగంగా జిల్లాలో మహిళలందరికీ సుమారు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో సబితా, ఎంపీడీవో సంజీవ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధా పాల్గొన్నారు.
పోలీసుల వాహనాల తనిఖీలు?
కరీంనగర్‌క్రైం: పోలీసుల నిత్యం ఇతరుల వాహనాలు తనిఖీచేయడం సహజం. కానీ.. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తమ వాహనాలనూ తనిఖీ చేసుకున్నారు. ఇదంతా స్థానిక పోలీసు హెడ్‌క్వాటర్స్ జరిగింది. చాలన్లు కట్టని వాటిని గుర్తించి కట్టించడం.. సరైన పత్రాలు లేని వాటిని సీజ్‌చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో డిపార్ట్‌మెంట్‌లో కొందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారి ఒకరు తాను విధినిర్వహణలో వాడే వాహనానాకి ఏమైనా చాలాన్ కట్టాల్సి ఉందా? అని అప్పటికప్పుడు చూసుకున్నట్లు సమాచారం. ఇకపై పోలీసులు వాడే వాహనాలకు సరైన పత్రాలు ఉండాల్సిందేనని ఈ తనిఖీ ద్వారా చెప్పకనే చెప్పారు.

‘పార్లమెంట్ అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి’