
పాశవిక చర్యకు చెంపపెట్టు
పచ్చని కశ్మీరాన్ని రక్తసిక్తం చేసి అతివల సిందూరాన్ని తుడిచివేసిన పహల్గాం పాశవిక చర్యకు ఆపరేషన్ సిందూర్ తగిన గుణపాఠం చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాదస్థావరాలపై దాడి చేసిన భారత సైనిక వ్యూహం అభినందనీయం.
– అయిత అనిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, జగిత్యాల
సైన్యానికి సలాం
దాయాది దేశ దాడుల్లో ప్రతీసారి తన సత్తా చూపిస్తున్న మన సైన్యానికి సలాం. మన దేశ సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఉగ్రస్థావరాలు, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న పాకిస్థాన్‌పై ముప్పేట దాడి చేసి, ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడంతో పేరుమోసిన ఉగ్రవాడులను మట్టపెట్టింది. ఈ సంఘటన సైన్య విజయపరంపరలో మరో మైలురాయి.
– కిరణ్‌కుమార్, యువజన అవార్డు గ్రహీత, రాంనగర్, కరీంనగర్
సాయుధులకు వందనం
పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్‌లో ఉగ్ర శిబిరాలపై చేసిన దాడులతో దేశప్రజలు గర్వంగా ఉన్నారు. నిత్యం ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థల కనుసన్నలో పాకిస్థాన్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. భారత సైన్యం మాత్రం అక్కడి ప్రజలకు, సైన్యానికి కానీ చిన్న హాని కూడ తలపెట్టకుండా కేవలం ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కూల్చివేసింది.
– కోట ప్రభాకర్‌రెడ్డి, ప్రైవేటు ఉపాధ్యాయుడు

పాశవిక చర్యకు చెంపపెట్టు

పాశవిక చర్యకు చెంపపెట్టు