కుటుంబ సభ్యులకు మహిళ అప్పగింత
కామారెడ్డి క్రైం: సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం అదృశ్యమవ్వగా ఆమెను కామారెడ్డి రైల్వే పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా చంద్రాపేట్ జ్యోతినగర్‌కు చెందిన రాచ సుగుణ(50) మంగళవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఠాణాలకు సమాచారం పంపారు. కామారెడ్డి రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై సుగుణ ఉండటాన్ని గమనించిన రైల్వే పోలీసులు కుమారుడు శంకర్‌ను పిలిపించి అప్పగించారు. మహిళ కుటుంబసభ్యులు రైల్వే ఎస్సై లింబాద్రి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.


