నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ డివిజన్ పరిధిలో చోరీకి గురైన 170 ఫోన్లను ఏసీపీ రాజా వెంకటరెడ్డి బుధవారం బాధితులకు అందజేశారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. 170 ఫోన్ల విలువ రూ.17 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా, అపహరణకు గురైనా సీఐఆర్‌లో బ్లాక్ చేసి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘపతి, నిజామాబాద్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు.


