స్థానిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
బాన్సువాడ రూరల్: పంచాయతీ ఎన్నికలను అధికారులు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేకాధికారి సత్యనారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కోనాపూర్ క్లస్టర్ జీపీలో కొనసాగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారులు జిల్లాల పర్యటన చేపడుతున్నారన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నామినేషన్ స్వీకరణతో పాటు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది నియామకాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట ఎంపీడీవో ఆనంద్, పంచాయతీ కార్యదర్శి భరత్‌కుమార్ ఉన్నారు.
బాన్సువాడ: బీర్కూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. బీర్కూర్‌లో సర్పంచ్ స్థానానికి ఎన్ని నామినేషన్‌లు వచ్చాయో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాలు సరిగ్గా చూసి తీసుకోవాలని అన్నారు. ఆమె వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
దోమకొండ: పంచాయతీ ఎన్నికల సందడి పెరుగుతోంది. బుధవారం మొదటి విడత నామపత్రాల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఎవరుంటారో తెలిపోయింది. దీంతో ప్రచారం ఊపందుకోనుంది. తొలి విడతలో 10 మండలాల్లో 167 గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఓటర్లను ఆకట్టుకోవడానికి తాయిలాలతోపా టు మందు, విందులు ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఓటర్లకు ఇంటికే మాంసం పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాంసం ధరలకు రెక్క లు వచ్చాయి. ఎన్నికల ముందు వరకు చికెన్ ధర కిలోకు రూ. 200 లోపు ఉండేది నాలుగైదు రోజులుగా రూ. 240పైనే ఉంటోంది.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2,781 మంది విద్యార్థులకు 2,538 మంది హాజరుకాగా 242 మంది గైరాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6,165 మంది విద్యార్థులకు 5,856 మంది హాజరుకాగా 309 మంది పరీక్ష రాయలేదని తెలిపారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డిబార్ అయినట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.
స్థానిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి


