ఒకే కుటుంబం నుంచి ముగ్గురి నామినేషన్లు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అక్కంపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇదే పంచాయతీ పరిధిలోని ఎనిమిది వార్డు స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు. అక్కంపల్లి సర్పంచ్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ జనరల్‌కు కేటాయించడంతో గ్రామానికి చెందిన గుండారం వెంకాగౌడ్, అతని భార్య అశ్వినితోపాటు అతని తల్లి స్వరూపరాణి నామినేషన్లు వేశారు. వీరిలో వెంకాగౌడ్ ఒక్కరు మాత్రమే బరిలో నిలిచి మిగితా ఇద్దరు అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకుంటారని సమాచారం. ఇదేగనుక జరిగితే అక్కంపల్లి జీపీ పాలకవర్గం ఏకగ్రీవం కానుంది.
కామారెడ్డి రూరల్: చిన్న మల్లారెడ్డి బాలికల జెడ్పీహెచ్‌ఎస్‌లో ‘సూపర్ బ్రెయిన్ యోగ‘ అనే అంశంపై గుంజిళ్ల అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందె జీవన్ రావు ‘సూపర్ బ్రెయిన్ యోగ‘ ప్రాముఖ్యతను వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగ చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని.. ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అభివర్ణించారు. గుంజీళ్లు తీయడాన్ని పాఠశాలలో శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని అన్నారు.
● తప్పుకోనున్న ఇద్దరు అభ్యర్థులు
● ఏకగ్రీవం కానున్న అక్కంపల్లి జీపీ
ఒకే కుటుంబం నుంచి ముగ్గురి నామినేషన్లు


