పక్కాగా లెక్కలు.. లేకుంటే చిక్కులు
● అభ్యర్థుల ఖర్చుల లెక్కలపై ప్రత్యేక నిఘా
ఎల్లారెడ్డి: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాల కోసం చేస్తున్న ఖర్చుల లెక్కలు పక్కాగా ఉండాలి లేకుంటే చిక్కులు తప్పవని అధికారులు అంటున్నారు. అభ్యర్థులు పెడుతున్న ఖర్చులపై నిఘా వేసేందుకు ప్రత్యేక సర్వైవల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వారు అంటున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా 5,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం కోసం రూ.2.50 లక్షలు, వార్డు మెంబర్లు రూ.50 వేలకు మించి ఖర్చు చేయకూడదు. అలాగే 5 వేలకు లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు స్థానాల అభ్యర్థులు రూ.30 వేలు మాత్రమే ఖర్చు పెట్టాలి. నామినేషన్ల సమయంలో అందజేసిన బ్యాంకు ఖాతాల ద్వారానే ఈ వ్యయాన్ని ఖర్చు చేయాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నిర్ణయించిన ఖర్చుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
● ప్రచారం కోసం వాడుతున్న టెంటు(18–36) ఖర్చు రూ.1,200, వేదిక కోసం రూ.1,000
● కాటన్ జెండా ఫీట్‌కు రూ,50, ప్లాస్టిక్ జెండాలు కిలోకు రూ.350
● చిన్న సైజు కరపత్రం ఒక్కో దానికి రూ.15 పైసలు
● మల్టీ కలర్ పోస్టర్లు 1,000 కి రూ.5 వేలు, 10, 000కు రూ.20 వేలు, 50,000కు రూ.36 వేలు
● మామూలు వినైల్ హోర్డింగ్ ఏర్పాటుకు రూ.6 వే లు,చెక్కహోర్డింగ్‌కు రూ.70 చదరపు అడుగుకు..
● సిటీ కేబుల్‌లో వీడియో ప్రచారానికి రోజుకు రూ.2,500.. నెల రోజులకు రూ.18 వేలు
● ప్రచార ఆడియో క్యాసెట్ రికార్డింగ్‌కు రూ.4 వేలు, ఆటో కిరాయి రూ.800
● ప్రచారం కోసం ఉపయోగించే ఇన్నోవా లాంటి లగ్జరీ కార్లకు రోజు అద్దె రూ.1,700, మామూలు కార్లకు రూ.1,000, ఆటోలకు రూ.700, ద్విచక్ర వాహనం రూ.150
● సమావేశాల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ కుర్చీలకు రోజు అద్దె రూ.7, వీఐపీ కుర్చీలకు రూ.40, సోఫాకు రూ.250, బల్లలకు రూ.50
● వీడియో కెమెరాకు రూ.1,000 ఫోటో గ్రాఫర్‌కు రూ.1,000
● ప్రచారం కోసం డప్పులను వాడితే ఒక్కో దానికి రోజుకు రూ.250, టోపీకి రూ.10, కండువాకు రూ.5
● లౌడ్ స్పీకర్, మైక్రోఫోన్‌కు రోజువారీ అద్దె రూ.600 నుంచి 1,800


